HomeTelugu Trendingలాలా సింగ్‌ చద్దాగా ఆమీర్‌ఖాన్‌ లుక్‌

లాలా సింగ్‌ చద్దాగా ఆమీర్‌ఖాన్‌ లుక్‌

5 16

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ఖాన్‌.. పాత్ర కోసం ఎంత కష్టమైనా భరించి, తదనుగుణంగా మారిపోయే అతి కొద్ది మంది నటుల్లో ఒకరు. వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ యువ కథానాయకులకే కాదు, తన తోటి నటులకు సైతం పోటీగా నిలుస్తుంటారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. సోమవారం ఇందులోని ఆమీర్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. గుబురు గెడ్డం, తలపై టర్బన్‌తో ఉన్న ఆమీర్‌ ఫొటోను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు, సినిమా విడుదలయ్యే సమయాన్ని కూడా ప్రకటించింది. వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా ‘లాల్‌ సింగ్‌ చద్దా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.
”క్రిస్మస్‌ 2020కి అంతా సిద్ధం. ఆమీర్‌ఖాన్‌, కరీనా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మీకోసం.. క్లాసిక్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ను స్ఫూర్తిగా తీసుకుని అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు”

ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ చండీగఢ్‌లో జరిగింది. కరీనాకపూర్‌ కూడా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమీర్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ తర్వాత ఆమీర్‌ నటిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఇందులోని పాత్ర కోసం ఆయన ఏకంగా 20 కిలోల బరువు తగ్గారు. అంతేకాదు, కరీనాకపూర్‌ను కూడా ఆడిషన్స్‌ చేసి ఈ ఇందులోని పాత్రకు ఎంపిక చేయడం గమనార్హం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu