HomeTelugu Trendingనా సామిరంగ: అంజి గాడి ఫస్ట్‌లుక్‌

నా సామిరంగ: అంజి గాడి ఫస్ట్‌లుక్‌

allari naresh first look fr
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. విజయ్‌ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి అప్డేట్స్‌ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మ‌రో ఆస్తకికర అప్డేట్‌ విడుదలైంది. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేష్ అంజి అనే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని వెల్లడించింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ.. మా అంజి గాడ్ని ప‌రిచ‌యం చేస్తున్నాం లేదంటే మాటోచ్చేత్త‌ది అంటూ రాసుకోచ్చింది.

ఇక అల్లరి నరేష్‌కు సంబంధించిన స్పెష‌ల్ ఇంట్రో ప్రోమోను రేపు ఉదయం 10.18 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ మూవీకి ఆస్కార్స్ విన్నింగ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu