పెళ్లికూతురు కాబోతున్న సైనా నెహ్వాల్..!

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌తో ఆమె వివాహం జరగనుందని విశ్వసనీయ సమాచారం. వీరిద్దరూ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారట. కొంత కాలంగా ఇద్దరి కుటుంబాల మధ్య పెళ్లికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఇప్పుడు వివాహం తేదీని కూడా ప్రకటించినట్లు వార్తలొస్తున్నాయి.

సైనా-కశ్యప్‌లు ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నా..వీటిపై ఎప్పుడూ వీళ్లు స్పందించలేదు. అలాగని ఖండించనూ లేదు. 2005లో పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. సైనా-కశ్యప్‌ జంట డిసెంబర్‌ 16న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే వీరి వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరగనుందట. ఐదురోజుల తర్వాత అంటే డిసెంబర్‌ 21న వైభవంగా రిసెప్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారట. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరుకాబోతున్నారు. మరోవైపు సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా “సైనా” అనే సినిమా రాబోతోంది. ఇందులో సైనా పాత్రలో బాలీవుడ్‌ నటి శ్రధ్ధా కపూర్‌ కనిపించనున్నారు. మంగళవారం ఈ చిత్ర లాంఛనంగా ప్రారంభమైంది.

View this post on Instagram

Yummmyyyyyyy😋😋😋 #supercheatday

A post shared by Parupalli Kashyap (@parupallikashyap) on