HomeTelugu Trendingఅల్లరి నరేష్‌ 'సభకు నమస్కారం' షూటింగ్‌ ప్రారంభం

అల్లరి నరేష్‌ ‘సభకు నమస్కారం’ షూటింగ్‌ ప్రారంభం

Allari Naresh Sabhaku namas

‘అల్లరి’ నరేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సభకు నమస్కారం’. మహేశ్ కోనేరు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకి సతీశ్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరిగాయి. నరేశ్ కూతురు ‘అయాన’ క్లాప్ ఇవ్వడంతో .. తొలి షాట్ కి ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించడంతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు. ‘నాంది’ హిట్ అయిన తరువాత తన సినిమాలు రొటీన్ గా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అల్లరి నరేశ్ చెప్పాడు. కథలో కొత్తదనం .. పాత్రల్లో వైవిధ్యం ఉంటేనే చేస్తానని అన్నాడు. ఆ తరువాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu