HomeTelugu News39 దేశాలకు వీసాల జారీ నిలిపివేత

39 దేశాలకు వీసాల జారీ నిలిపివేత

13 12

ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో జరిగిన వరుసబాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో 39 దేశాలకు వీసా జారీని నిలిపివేసింది ఆ దేశ ప్రభుత్వం. భధ్రతా చర్యల నేపథ్యంలో శ్రీలంకలోకి ఈ దేశాలకు చెందిన పర్యాటకులను అడ్డుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రిత్వశాఖ వెల్లడించింది. శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్యా 39 దేశాలకు వీసా జారీ ప్రక్రియను నిలిపి వేశాం. భద్రతా చర్యల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నాం. కొన్ని రోజుల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇక్కడ జరిగిన వరుస దాడుల్లో నిందితులకు అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలున్నాయని విచారణలో వెల్లడైంది. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే వీసాల జారీని నిలిపేశామని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి జాన్‌ అమరతుంగ వెల్లడించారు.

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 7,40,600 మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్లారు. గతేడాది సుమారు 4,50,000మంది భారతీయులు శ్రీలంకను సందర్శించారు. శ్రీలంక ద్వీపం కావడంతో అక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు ఏటా అక్కడికి లక్షల్లో పర్యాటకులు వెళుతుంటారు. ఈ ఏడాది భారతీయ పర్యాటకులు మిలియన్‌ మార్కును చేరుకుంటారని ఆ దేశ పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. ఇక ఈస్టర్‌ సండేనాడు జరిగిన వరుసబాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటికి 350 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu