‘న‌వీన్ చంద్ర’ 28 డిగ్రీల సెల్సియస్

న‌వీన్ చంద్ర, షాలిని హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ’28 డిగ్రీల C’ వీరాంజ‌నేయ ప్రొడ‌క్షన్స్‌, రివ‌ర్ సైడ్ సినిమాస్ ప‌తాకాల‌పై డా.అనిల్ విశ్వనాథ్ ద‌ర్శక‌త్వంలో అభిషేక్ సాయి నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి త‌న ట్విట్టర్ అకౌంట్ ద్వారా గురువారం విడుద‌ల‌ చేశారు.

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత అభిషేక్ సాయి మాట్లాడుతూ.. “28C అనే టైటిల్ అంద‌రిలో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. న‌వీన్‌ చంద్రకు ఈ సినిమాతో మంచి హిట్ వ‌స్తుంద‌నే న‌మ్మకం ఉంది. డా.అనిల్ విశ్వనాథ్‌ స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కిట్టు విస్సాప్రగ‌డ‌ క‌థ‌కు త‌గ్గ మాట‌లు, మ్యూజిక్‌కి అనుగుణంగా పాట‌లను అందించారు. సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. త‌ర్వలోనే సినిమా విడుద‌ల తేదిని ప్రక‌టిస్తాం అని తెలిపారు.