HomeTelugu Trendingశాకుంతలంతో అర్హ ఎంట్రీ .. ట్వీట్‌ చేసిన అల్లు అర్జున్‌

శాకుంతలంతో అర్హ ఎంట్రీ .. ట్వీట్‌ చేసిన అల్లు అర్జున్‌

Allu arha debut with samant
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాలపట్టి అర్హ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ చేశాడు. అది కూడా బడా హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమా ద్వారా ఆమెను నటిగా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. అయితే తన క్యూట్‌, స్వీట్‌, అల్లరి చేష్టలతో అర్హ ఈపాటికే తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. మరి ఇప్పుడు ఏకంగా నటించే చాన్స్‌ వచ్చిందంటే జనాలను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలంటున్నారు అభిమానులు.

తన కూతురి సినీ ఎంట్రీ సమంత సినిమా ద్వారా జరుగుతుండంపై హర్షం వ్యక్తం చేశాడు బన్నీ. ‘సమంతతో వైవిధ్యమైన జర్నీ కొనసాగించాను. ఆమె సినిమా ద్వారా అల్లు అర్హ నటిగా పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. శాకుంతలం సినిమా టీమ్‌కు ఇవే నా అభినందనలు’ అంటూ ట్వీట్‌ చేశాడు. పీరియాడికల్‌ మూవీ శాకుంతలం విషయానికి వస్తే ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. దుష్యంతుడు- శకుంతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. శకుంతల పాత్రలో సమంత, గుణశేఖర్‌ పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం సమంత నాలుగు నెలలపాటు క్లాసికల్‌ డ్యాన్సులు కూడా నేర్చుకుంది. శాకుంతలం కొడుకు భరత్‌ పాత్ర కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌లలో ఎవరో ఒకరు నటించేలా ఒప్పించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట! ఈ సినిమాను ‘దిల్‌’ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

Recent Articles English

Gallery

Recent Articles Telugu