HomeTelugu Trendingపిల్లలతో అల్లు అర్జున్‌ వీడియో వైరల్‌

పిల్లలతో అల్లు అర్జున్‌ వీడియో వైరల్‌

Allu arjuns adorable moment

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ కుంటుంబానికి ఎంత ప్రధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ఏ సందర్భం వచ్చినా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి మరీ కుటుంబంతోనే సరదాగా గడుపుతుంటారు. ఇక ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగులకు కూడా బ్రేక్‌ పడింది. ఈ సమయాన్ని అల్లు అర్జున్‌ పూర్తిగా కుటుంబానికే కేటాయించారు. బుధవారం పిల్లలు అయాన్‌, అర్హలతో అ‍ల్లు అర్జున్‌​ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను స్నేహ రెడ్డి తన ఫోన్‌లో వీడియో తీసింది.

ఆకాశంలోకి చూస్తూ బన్నీ పిల్లలకు ఏదో వివరిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ వీడియో స్నేహ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా.. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Recent Articles English

Gallery

Recent Articles Telugu