HomeTelugu Trendingక్రేజీ కాంబినేషన్‌తో బన్నీ.. ప్యాన్‌ ఇండియా మూవీ

క్రేజీ కాంబినేషన్‌తో బన్నీ.. ప్యాన్‌ ఇండియా మూవీ

5 10స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ హిట్‌ తర్వాత.. సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటకే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఈ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియాల స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. కాగా అల్లు అర్జున్‌ ఇప్పటి వరుకు టాలీవుడ్‌లో చాలా మంది డైరెక్టర్‌లతో పని చేయలేదు. వారిలో కొరటాల శివ ఒక్కరు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలో ఓ సినిమా పట్టాలెక్కనుంది సినీ వర్గాలు అంటున్నాయి. ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే బన్నీ “పుష్ప” మూవీ, కొరటాల శివ “ఆచార్య” మూవీ పూర్తి అయ్యాక వీరిద్దరి సినిమా సెట్‌ మీదకు వెళ్లే అవకాశముంది. త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

5a 3

Recent Articles English

Gallery

Recent Articles Telugu