మహేష్‌ పై ఆర్‌ఎక్స్‌ 100 హీరో వైరల్‌ ట్వీట్‌

ఆర్‌ఎక్స్‌ 100 మూవీతో సెన్సేషన్‌ సృష్టించిన యువ నటుడు కార్తికేయ, సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గురించి కార్తీకేయ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దీపావళి కానుకగా విడుదలైన విజయ్‌, మురుగదాస్‌ల సర్కార్‌ సినిమాపై మహేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సర్కార్‌ బాగుందంటూ మహేష్‌ చేసిన ట్వీట్‌కు మురుగదాస్‌ రిప్లై కూడా ఇచ్చాడు.

తాజాగా ఈ ట్వీట్‌ పై స్పందించిన కార్తికేయ ‘సూపర్‌స్టార్‌ గా ఉండటం అంటే స్టార్‌డమ్ మాత్రమే కాదు. మహేష్ సర్‌ లాంటి వారు చూపించే యాటిట్యూడ్‌ అది. స్పైడర్‌ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా.. మురుగదాస్‌ గారి పట్ల మహేష్ గారి గౌరవం అలాగే ఉంది. ఒక స్టార్‌ మరో స్టార్‌ హీరో సినిమాను ప్రమోట్ చేయటం చాలా గొప్ప విషయం అంటూ ట్వీట్ చేశాడు ఈ యువ హీరో.