HomeTelugu Trendingమా కాంబినేషన్‌ చాలాకాలం గుర్తుండిపోతుంది: అల్లు అర్జున్‌

మా కాంబినేషన్‌ చాలాకాలం గుర్తుండిపోతుంది: అల్లు అర్జున్‌

allu arjun pan india movie
టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో పాన్ ఇండియా చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈక్రమంలో.. అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

“ఈ కాంబినేషన్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నాను. సందీప్ వంగా మ్యాజిక్ ఏంటో గానీ, ఎక్కడో నన్ను బలంగా తాకింది. మా కాంబినేషన్ లో వచ్చే చిత్రం చాలాకాలం గుర్తుండిపోయేలా ఉంటుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. ఈ మ్యాజికల్ ప్రాజెక్టును ఖరారు చేసిన నిర్మాత భూషణ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు అల్లు అర్జున్ వెల్లడించారు.

టాలీవుడ్‌లో అల్లు అరవింద్‌ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఒదిగిపోయ్యాడు. బన్నీ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప-2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో గానీ, సందీప్ వంగాతో మూవీ చేసే అవకాశలు ఉన్నాయి.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu