ఆ దినపత్రికపై బన్నీ కోపం!

‘దువ్వాడ జగన్నాథం’ ట్రైలర్స్ తోనే ఆడియన్స్ లో ఆసక్తి కలిగించాడు. ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీ సినిమాల పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాంటిది ఈ సినిమాకు ఆడియో ఫంక్షన్ తప్ప మరే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టలేదు. ఈసారి మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం తగ్గిద్దామని బన్నీ స్వయంగా చెప్పినట్లు సమాచారం. దానికో కారణం ఉంది. గతంలో పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆయన చేసిన ‘చెప్పను బ్రదర్’ అనే కామెంట్ చేశాడు.
దీనికి పవన్ ఫ్యాన్స్ నుండి బన్నీకి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సరైనోడు సినిమా సమయంలో ఓ దినపత్రికకు బన్నీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మరోసారి పవన్ గురించి మాట్లాడుతూ ‘చెప్పను బ్రదర్’ అనేశాడు. దాన్ని కాస్త హైలైట్ చేస్తూ.. ప్రధాన తెలుగు దినపత్రిక ఆర్టికల్ ప్రచురించింది. దీంతో అప్పటినుండి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి బన్నీ ఇబ్బంది పడుతున్నాడు. అయితే బన్నీను ఎలాగైనా.. ఒప్పించి ఇంటర్వ్యూలు ఇప్పించాలని దిల్ రాజు పీఆర్వోలు ప్రయత్నిస్తున్నారు. మరి దీనికి బన్నీ ఒప్పుకుంటాడో.. లేదో.. చూడాలి!