HomeTelugu Big Storiesభారత్‌లో సైలెంట్‌గా విజృంభిస్తోన్న కరోనా..!

భారత్‌లో సైలెంట్‌గా విజృంభిస్తోన్న కరోనా..!

1 17
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఆ దేశాన్ని గడగడలాంచింది. ఈ వైరస్‌తో అక్కడ దాదాపు 3,000 కుపైగా మృతి చెందగా.. ఇప్పుడు ఆ దేశంలో కొంత తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే ఈ వైరస్‌ ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా పాకేసింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని దేశాలు వణికిపోతున్నాయి. దీని బారి నుంచి కాపాడుకోవాలంటే ఇప్పటి వరకు ఎలాంటి మందులు లేవు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రస్తుత పరిస్థితి. ఈ వైరస్‌ ఎక్కువగా ఇతర దేశాల్లో ప్రయాణం చేసి వస్తున్న వారిలోనే ఎక్కువగా కనిపిస్తోందని అధికారులు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్‌లో ఈ వైరస్‌ ప్రభావం పెద్దగా ఉండదు అని అనుకున్నప్పటికీ… ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎండలు ముదరడంతో ఈ వైరస్‌ చచ్చిపోతుందనుకుంటే మనషులను చంపేస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే దేశంలో ముగ్గురు మృతి చెందారు. 160కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ వైరస్ నెమ్మది తెలుగు రాష్ట్రాల్లోకి పాకుతోంది. ఇప్పటికే తెలంగాణలో 13, ఏపీలో 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి.

ఇప్పడు దేశంలో కరోనా రెండో దశ నడుస్తోందని వైద్య అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు. స్కూళ్లు, సినిమా థియేటర్స్, షాపింగ్‌ మాల్స్‌, జనసముహం ఎక్కువగా ఉండే ప్రదేశాలను బంద్‌ చేశారు. అయితే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినప్పటికీ.. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, అత్యవసరం అయితే తప్ప ప్రయాణలు చేయొద్దని అధికారులు చెప్తున్నారు. జలుబు, దగ్గు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ గాని, తువాలు గాని అడ్డం పెట్టుకోవాలని సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. ఈ వైరస్‌ గాలిలో 3 గంటలు, రాగి ఉపరితంలో 4 గంటలు, అట్ట పెట్టెలు పై 24 గంటలు, ప్లాస్టిక్‌ , స్టెయిన్ లెస్‌ స్టీల్‌పై 2-3 రోజులు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu