HomeTelugu Trendingబర్త్‌డే సందర్భంగా.. బన్నీ మూవీ టైటిల్‌!

బర్త్‌డే సందర్భంగా.. బన్నీ మూవీ టైటిల్‌!

1 1
స్టైలిష్ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ నెల 8న అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట మూవీయూనిట్. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను చిత్రబృందం ఖండించింది. మరి.. టైటిల్‌ ఏంటో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో ఆర్య’(2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాలు వచ్చాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu