HomeTelugu Trending'సేనాపతి' ట్రైలర్‌

‘సేనాపతి’ ట్రైలర్‌

Senapathi trailer
టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఓటీటీ వెంచర్ గా ‘సేనాపతి’ సినిమాను నిర్మించింది. పవన్ సాధినేని డైరెక్షన్‌ ఈ సినిమా వస్తుంది. గతంలో ఆయన నుంచి ‘సావిత్రి’ .. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా ‘ఆహా’లో ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. “జీవితంలో మంచి – చెడు రెండూ చూడాలి, ఆ రెండింటి మధ్యే ఎదగాలి” అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలైంది. పోలీస్ లకు .. రౌడీలకు మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపించే కృష్ణమూర్తి ప్రమాదకరమైన పనులను చక్కబెడుతుంటాడు.

కృష్ణమూర్తి .. ఆ తరువాత సేనాపతిగా మారతాడు అనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. అందుకు కారణమేమిటి? రహస్యంగా ఆయన సాగిస్తున్న అన్వేషణ దేని కోసం? అనే అంశాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ప్రశ్నలను సమాధానం దొరకాలంటే ‘సేనాపతి’ని చూడటం ఒక్కటే మార్గం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu