HomeTelugu Trendingకోలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రష్మిక

కోలీవుడ్‌లో మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన రష్మిక

Rashmika opposite Suriya
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతున్న బ్యూటీ రష్మిక మందన. ‘ఛలో’ సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు ‘గీత గోవిందం’ సినిమాతో మరింత క్రేజ్‌ సంపాదించుకుంది. కార్తీ హీరోగా బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్‌’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు రష్మిక. కోలీవుడ్‌లో మొదటి సినిమా విడుదల అవ్వకముందే రష్మికని మరో క్రేజీ ఆఫర్‌ వరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి‌. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యకు జోడీగా తర్వాతి సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందట. ‘ఆకాశమే నీ హద్దురా’లో తన మార్కు నటన చూపించి విమర్శల ప్రశంసలు సైతం అందుకున్నాడు సూర్య. ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూనే.. సూర్య తన 40వ సినిమాకు కూడా ఓకే చెప్పేశాడు. పాండిరాజ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. సినిమాలో హీరోయిన్‌గా రష్మికని తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. కాగా రష్మిక టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ పుష్పా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu