HomeTelugu Trendingతమ్ముడికి బన్నీ బర్త్‌డే విషెస్‌

తమ్ముడికి బన్నీ బర్త్‌డే విషెస్‌

Allu arjun birthday wishes
ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ సోదరుడు, హీరో అల్లు శిరీష్‌ ఈరోజు ఆదివారం 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, పలువురు యంగ్‌ హీరోలు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. మరోవైపు తన తమ్ముడికి విషెస్‌ తెలుపుతూ బన్నీ ఓ ట్వీట్‌ పెట్టారు.’నా అతి పెద్ద నైతిక మద్దతు.. నా స్వీటెస్ట్ సోదరుడికి వండర్ ఫుల్ డే.. కలిసొచ్చే కాలం ముందుంది.. రానున్నది సుందరమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను’ అని బన్నీ ట్వీట్‌ చేశారు.

కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది యంగ్‌ హీరోలకు శిరీష్‌ బహుమతులు ఇచ్చారు. చాక్లెట్‌ కేక్‌, చాక్లెట్స్‌‌, బిస్కెట్స్‌ ఉన్న ఓ స్పెషల్‌ బాక్స్‌ని అడవి శేష్‌, విశ్వక్‌సేన్‌, రాశీఖన్నా, అల్లు అర్జున్‌లకు శిరీష్‌ పంపించారు. ‘హ్యాపీ బర్త్‌డే శిరీష్‌. చాక్లెట్‌ బాక్స్‌కి థ్యాంక్యూ. బర్త్‌డే నీది కానీ గిఫ్ట్స్‌ మాత్రం మా అందిరికీ’ అని శేష్‌ పోస్ట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu