HomeTelugu Trendingషారుఖ్‌ సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో!

షారుఖ్‌ సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో!

Allu Arjun in Jawan
బాలీవుడ్‌ బాదుషా షారుఖ్‌ ఖాన్‌ నటిస్తున్న సినిమా ‘జవాన్‌’. ఈ సినిమాలో ఓ పాన్‌ ఇండియా హీరో గెస్ట్‌ రోల్‌ చేయబోతున్నట్లు టాక్‌. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేశాడు. ఆయన తాజాగా నటించిన `పఠాన్` ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 950 కోట్ల మేర వసూళ్లని రాబట్టి అత్యధిక వసూళ్లని రాబట్టిన బాలీవుడ్ మూవీగా సరికొత్త రికార్డేని సొంతం చేసుకుంది.

అదే జోష్‌తో అట్లీ దర్శకత్వంలో ‘జవాన్‌’ పూర్తి చేస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. న‌య‌న‌తార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీస‌ర్‌ పాత్ర పోషించనుంది. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ ర‌విచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారుఖ్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జూన్ 2న విడుద‌ల కానుంది.

Allu Arjun 1

ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ నటించబోతున్నట్లు బాలీవుడ్‌ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అట్లీ, అల్లు అర్జున్‌ను కలిసి తన రోల్‌ గురించి చెప్పాడట. బన్నీకి పాత్ర నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్‌ ఉంది. తమిళ వెర్షన్ లో విజయ్ గెస్ట్ గా కనిపించనుండగా తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్ చేత కీలక అతిథి పాత్ర చేయించాలని షారుక్ అట్లీ ప్రయత్నాలు చేస్తున్నారట.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu