HomeTelugu Trending'మేజర్‌' నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్ట్‌లుక్‌

‘మేజర్‌’ నుంచి శోభిత ధూళిపాళ్ల ఫస్ట్‌లుక్‌

Sobhita dhulipala look from

టాలీవుడ్‌ యంగ్ హీరో అడవిశేష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మేజర్’. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శోభిత ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఫస్ట్‌లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రమోద అనే పాత్రలో శోభిత నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమా జులై 2న పలు భాషల్లో విడుదల కానున్నట్లు తెలియజేశారు.

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

Recent Articles English

Gallery

Recent Articles Telugu