HomeTelugu Newsబ్రహ్మానందాన్ని కలిసి అల్లు అర్జున్‌..

బ్రహ్మానందాన్ని కలిసి అల్లు అర్జున్‌..

1 7ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందాన్ని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కలిశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు బైపాస్‌ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ.. ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మానందంతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘రియల్‌ ఐరన్‌ మ్యాన్. దృఢమైన మనసున్న మనిషి. ఫన్నీ అండ్‌ ఫియర్‌లెస్‌. నా కిల్‌బిల్‌ పాండేను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

ఫన్నీగా కన్నుకొడుతూ ఫొటోకు బ్రహ్మానందం ఇచ్చిన పోజు నవ్వులు పూయిస్తోంది. ఇప్పటివరకు ఈ ఫొటోను ఏడు వేల మందికిపైగా లైక్‌ చేశారు. బన్నీ, బ్రహ్మానందం కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘ఆర్య 2’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసు గుర్రం’ వంటి ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలిసి చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu