HomeTelugu Newsవైద్య సిబ్బందికి ప్రభుత్వం తగిన భరోసా ఇవ్వాలి: పవన్‌ కల్యాణ్‌

వైద్య సిబ్బందికి ప్రభుత్వం తగిన భరోసా ఇవ్వాలి: పవన్‌ కల్యాణ్‌

5 6

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. కరోనా వైరస్‌ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎంతో సాహసోపేతంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. వైద్యులను భగవంతుడితో సమానంగా చూసే సంస్కృతి ఉన్న దేశం మనది అన్నారు.

”మానవతామూర్తులైన ఎందరో వైద్యులు తమ వృత్తి ధర్మంతో పేదలకు ఎనలేని సేవలు చేస్తున్నారు. తమకీ, తమ కుటుంబానికీ వైరస్ ముప్పు ఉంటుందని తెలిసీ రోగులకు సేవలు చేస్తున్నవారిని ఎప్పటికీ మరచిపోకూడదు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోవిడ్-19 విధుల్లో ఉన్నవారందరికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా పీపీఈలు సమకూర్చాలి. రోగుల సేవలో ఉన్న నర్సులు, ప్రసూతి ఆయాల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడంతో పాటు ఉద్యోగ భద్రతకు తగిన చట్టాలు తీసుకురావాలి” అని ఆయన కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu