HomeTelugu Trendingబోయపాటిని లైన్‌లో పెట్టిన బన్నీ!

బోయపాటిని లైన్‌లో పెట్టిన బన్నీ!

Allu arjun movie with boyap
స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను ‘క్రిస్మస్’కు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత బన్నీ ‘ఐకాన్’ సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ, పాన్ ఇండియా మూవీగా ఉండాలనే ఉద్దేశంతో అందుకు తగినట్టుగా మార్పులు .. చేర్పులు చేస్తున్నారట.

అయితే బన్నీ తదుపరి చిత్రం బోయపాటి దర్శకత్వంలో ఉండనుందనేది తాజా సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘సరైనోడు’ వంటి భారీ హిట్ వచ్చింది. అందువలన ఈ కాంబినేషన్ పై క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే బోయపాటి ఒక కథ వినిపించడం .. అందుకు సంబంధించి ఆయనకి అడ్వాన్స్ ముట్టినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే వేణు శ్రీరామ్ .. మురుగదాస్ సినిమాల తరువాత ఈ ప్రాజెక్టు ఉండవచ్చని అనుకున్నారు. కానీ బోయపాటి కథవైపు మొగ్గు చూపిన అల్లు అర్జున్, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu