HomeTelugu Trendingలారీ డ్రైవింగ్ నేర్చుకుంటున్న స్టైలిష్ స్టార్!

లారీ డ్రైవింగ్ నేర్చుకుంటున్న స్టైలిష్ స్టార్!

5 11
స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ తరువాతి సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అధికారికంగా ఏ విషయమూ బయటికి రాకపోవడంతో, అభిమానులు ఇంకా సందేహంగానే వున్నారు.

అయితే కొన్ని రోజులుగా అల్లు అర్జున్ లారీ డ్రైవింగులో శిక్షణ తీసుకుంటున్నట్టుగా ఒక వార్త బయటికి వచ్చింది. దాంతో ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించేది నిజమేనని తెలుస్తోంది. బీడీ తాగుతూ .. లుంగీ పైకి కట్టి .. పూర్తి మాస్ లుక్ తో చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఉంటాడట. రష్మిక హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu