HomeTelugu Trendingవరుడు కావలెను నుండి ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్‌ విడుదల

వరుడు కావలెను నుండి ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్‌ విడుదల

digu digu digu naaga lyrica

టాలీవుడ్‌ యువ నటుడు నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ మాస్‌ సాంగ్‌ ను విడుదల చేసింది మూవీ యూనిట్‌.

‘దిగు దిగు దిగు నాగ’ అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా… శ్రేయ ఘోషల్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. తెలంగాణలో చాలా పాపులర్‌ అయిన ఫోక్‌ సాంగ్‌ దిగు దిగు దిగు నాగ’మాదిరి, చాలా హుసారుగా సాగే పాట ఇది. ‘కొంపాకొచ్చిపోరో కోడెనాగ .. కొంపా ముంచుతాందోయ్ ఈడు బాగా’ వంటి పదప్రయోగాలు బాగున్నాయి. మాస్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే పాట ఇది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌తో పాటు ఓ మెలోడీ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu