HomeTelugu Trendingఅర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌తో బన్నీ

అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌తో బన్నీ

allu arjun pan india movieటాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దీంతో ఈయనకు మీపరితమైన క్రేజ్‌ ఏర్పడింది. ప్రస్తుతం పుష్ప-2 తో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో ప్రాజెక్ట్‌ ప్రకటించాడు బన్నీ. టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి తో ఎంట్రీ ఇచ్చిన యంగ్‌ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా చేయబోతున్నాడు.

ప్రభాస్ తో ఆదిపురుష్ చిత్రాన్ని నిర్మిస్తున్న టీ సిరీస్ అధినేత భూషణ్‌ కుమార్‌ దీనికి నిర్మాత. ఈ ముగ్గురి కాంబినేషన్ వస్తున్న సినిమా గురించి చిత్ర యూనిట్ ఈ రోజు ప్రకటన చేసింది. బన్నీ, సందీప్ రెడ్డి, భూషణ్ కుమార్, ఇతర సహ నిర్మాతలు కలిసున్న ఫొటోను టీ సిరీస్ ట్విట్టర్ లో షేర్ చేసింది.

టీ సిరీస్‌, సందీప్‌ హోం బ్యానర్‌ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. రణ్ బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్ రెడ్డి ‘యానిమల్‌’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇది పూర్తైన తరువాత బన్నీ- సందీప్‌ వంగా మూవీ 2025లో సెట్స్‌ పైకి వెళ్లనుంది. అల్లు అర్జున్ కి ఇది 23వ చిత్రం.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu