HomeTelugu Trendingఉప్పెన చిత్రంపై బన్నీ కామెంట్

ఉప్పెన చిత్రంపై బన్నీ కామెంట్

Allu Arjun about Uppena mov

వైష్ణవ్‌ తేజ్ తెరంగేట్రంతో వచ్చిన ఉప్పెన చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఉప్పెన మూవీ టీమ్‌ను అల్లు అర్జున్‌ ప్రశంసించారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న బన్నీ ఉప్పెన చిత్రంపై ఆలస్యంగా స్పందించారు. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా తెరకెక్కించారన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు హైలైట్ అన్నారు. తొలి చిత్రంలోనే వైష్ణవ్ తేజ్ గొప్పగా నటించారని అన్నారు. హీరోయిన్ కృతిశెట్టి, విజయ్ సేతుపతి నటనను మెచ్చుకున్నారు. విజయ్‌ సేతుపతి తన నటనతో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లారని మెచ్చుకున్నారు. ఇలాంటి అద్భుతమైన సినిమాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కథలపై మైత్రీమూవీ మేకర్స్‌కు ఎంత నమ్మకం ఉందో తెలియజేస్తుందని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu