HomeTelugu Trendingలేడీ బ్రూస్లీ టీజర్‌ యాక్షన్‌, అందాలతో అదరగొట్టిన వర్మ

లేడీ బ్రూస్లీ టీజర్‌ యాక్షన్‌, అందాలతో అదరగొట్టిన వర్మ

9 24వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసే వర్మకు మొదటి నుంచి యాక్షన్ చిత్రాలనంటే పిచ్చి. అందులోను బ్రూస్ లీ కి వర్మ పెద్ద ఫ్యాన్. బ్రూస్ లీ లానే తాను కూడా ఉండాలని చెప్పి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. బ్రూస్ లీ ఎంటర్ ది డ్రాగన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. దానిని స్ఫూర్తిగా తీసుకొని బ్రూస్ లీ గా ఎదగాలని ఓ యువతి పడిన తపనను ఆధారంగా చేసుకొని ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ టైటిల్ తో సినిమాను తీశాడు. ఇండో చైనీస్ కొలాబరేషన్ లో సినిమా తెరక్కింది. ఈ సినిమా ద్వారా పూజా బాలేకర్ అనే నటిని పరిచయం చేశాడు వర్మ.

ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. మహిళా అందాలను ఎలా చూపించాలో అలా చూపించి కనువిందు చేశాడు. బ్రూస్ లీ పుట్టినరోజైన ఈరోజున వర్మ ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక డిసెంబర్ 13 వ తేదీన చైనాలో బ్రూస్ లీ పుట్టిన పట్టణంలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తారట. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో ఓ యువతి పడిన కష్టం.. బ్రూస్ లీ లా ఎందుకు మారాలి అనుకున్నది.. అలా మారే సమయంలో ఆమెకు ఎదురైనా కష్టాలను వర్మ ఈ టీజర్ లో చూపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu