HomeTelugu Trendingఅల్లు అర్జున్‌ కొత్త సినిమా టైటిల్‌, లుక్‌

అల్లు అర్జున్‌ కొత్త సినిమా టైటిల్‌, లుక్‌

1 7
టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు ఆయన పుట్టిన రోజు బహుమతి ఇచ్చేశాడు. సుకుమార్‌ డైరెక్షన్‌లో బన్నీ తాజాగా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం మైత్రీ మూవీ మేకర్స్‌ అభిమానులతో పంచుకుంది.

ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గుబురు గడ్డం, ఒత్తు జుట్టుతో తీక్షణంగా చూస్తున్న బన్ని లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘ఇది నా తర్వాత చిత్రం ఫస్ట్‌లుక్‌. టైటిల్‌ ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. దీని గురించి చాలా ఉత్సుకతతో ఉన్నా. ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.

చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. బన్ని ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని ఇటీవలే వార్తలొచ్చాయి. అందుకు తగినట్లుగానే తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, స్టైల్‌ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఇప్పటికే ఈ టైటిల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu