చెర్రీ, బన్నీ మల్టీస్టారర్ నిజమెంత!

మెగాఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంటూ ఇప్పుడు అభిమానులు సెపరేట్ అయిన సంగతి తెలిసిందే. అటు రామ్ చరణ్ గానీ, ఇటు అల్లు అర్జున్ గానీ తమదైన స్టయిల్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ.. సినిమాలు చేస్తున్నారు. గతంలో అభిమానుల కోరిక మేరకు వీరిద్దరూ కలిసి ‘ఎవడు’ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి కలిసి నటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి ఈ ఇద్దరు హీరోలు కూడా రెడీ అని చెబుతున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుందని
దానికి చరణ్-అర్జున్ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారని చెబుతున్నారు.

కానీ ప్రాక్టికల్ గా ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేదే డౌట్. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత మణిరత్నంతో మరో సినిమా చేయబోతున్నాడు. అటు బన్నీ కూడా డిజె తరువాత వక్కంతం వంశీతో ఓ సినిమా అలానే లింగుస్వామితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇవన్నీ పూర్తయ్యి ఇద్దరికీ డేట్స్ కుదిరి సినిమా చేయాలంటే ఇప్పట్లో కుదిరే పనిలా లేదు!