HomeTelugu Trending'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌.. మైండ్ బ్లోయింగ్: అల్లు అర్జున్‌

‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్‌.. మైండ్ బ్లోయింగ్: అల్లు అర్జున్‌

Allu arjun reaction on rrr
‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ చూస్తే మతిపోతోందని వ్యాఖ్యానించారు. “రాజమౌళి గారూ మీరు భారతీయ చిత్రపరిశ్రమకు గర్వకారణం” అని కొనియాడారు.

“మైండ్ బ్లోయింగ్!… నా బ్రదర్ రామ్ చరణ్, నా బావ తారక్ కలిసి పవర్ ప్యాక్ షో అందించారు. అజయ్ దేవగణ్ కు, అలియా భట్ కు, యావత్ తారాగణం, సాంకేతిక నిపుణుల బృందానికి శుభాకాంక్షలు” అంటూ బన్నీ ట్వీట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ గ్లింప్స్ వీడియోను కూడా పంచుకున్నారు. దీనిపై ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ స్పందిస్తూ, “థాంక్యూ సో మచ్ అన్నా” అంటూ అల్లు అర్జున్ కు బదులిచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu