తనదైన శైలిలో శ్రీదేవిని స్మరించుకున్న వర్మ

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీదేవి అంటే ప్రాణాం ఇస్తాడు. అంతలా అంతిలోక సుందరి శ్రీదేవిని ఆరాధించాడు వర్మ. అయితే, గతేడాది ఆమె హఠాన్మరణం చెందడంతో ఆయన తీవ్రఆవేదనకు గురయ్యాడు. తొలిసారిని దేవుడిపై కోపం వస్తోందంటూ ట్వీట్ చేసి.. శ్రీదేవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తాజాగా, శ్రీదేవి తొలి వర్ధంతి సందర్భంగా రాంగోపాల్ వర్మ.. ట్విట్టర్ వేదికగా మరోసారి అతిలోక సుందరి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో తన అభిమాన నటికి నివాళులర్పించారు. ఒకప్పుడు క్షణక్షణం సినిమా సెట్‌లో హీరోలు నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి, శ్రీదేవిలతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన వర్మ… తనదైన శైలిలో చమత్కరించారు.

‘ ఈ ఫొటోలో ఎడమ పక్కన చివరగా ఉన్న మహా వెదవను నేనే. నేను నిజాయతీపరుడ్ని .. అందుకే చేతిలో ఉన్న గ్లాసును దాచడం లేదు. కొందరు మాత్రం దాస్తున్నారు. ఇక, శ్రీదేవి రెండు చేతులూ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజాయితీ కేవలం నాకూ, నాగార్జునకినూ, శ్రీదేవిలోనూ మాత్రమే ఉంది కాబట్టి’ అంటూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు వర్మ. తనదైన శైలిలో శ్రీదేవిని స్మరించుకున్నారు. శ్రీదేవిని ఎంతగానో అభిమానించే వర్మ.. ఆమె హీరోయిన్‌గా క్షణక్షణం, గోవింద గోవింద సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు రాంగోపాల్ వర్మ. త్వరలోనే ఈ సినిమాను తెరమీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ సినీ, రాజకీయవర్గాల్లో పెనుసంచలనమే రేపింది.

https://twitter.com/RGVzoomin/status/1099361628724826112