సమంత ఓకే చెబుతుందా..?

ఎన్టీఆర్, సమంత హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జనతాగ్యారేజ్ సినిమాలో కూడా వీరిద్దరూ జంటగా కనిపించి మెప్పించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో తను నటిస్తోన్న ‘జైలవకుశ’ సినిమాలో మెయిన్ లీడ్ కోసం సమంతను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో రాశిఖన్నా, నివేదా థామస్ లను హీరోయిన్లుగా ఎన్నుకున్నారు.

మరో హీరోయిన్ పాత్ర కూడా ఉండడంతో ఎన్టీఆర్, సమంత వైపు మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం సమంత ‘రాజుగారిగది2’ సినిమాతో పాటు చరణ్-సుకుమార్ ల సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే రెండు, మూడు తమిళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ నేపధ్యంలో సమంత, ఎన్టీఆర్ సినిమాకు డేట్స్ కేటాయిస్తుందా..? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి సామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. చూడాలి!