మలయాళంలో బన్నీ స్ట్రెయిట్ ఫిల్మ్!

అల్లు అర్జున్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కేరళలో కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. బన్నీ సినిమాలన్నింటినీ మలయాళంలో డబ్ చేస్తుంటారు. అక్కడ ఆయన సినిమాలకు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ స్ట్రెయిట్ సినిమాలను ధీటుగా బన్నీ సినిమాలు విడుదలవుతుంటాయి. అంతగా ఆదరిస్తున్న మలయాళీయుల కోసం బన్నీ ఓ స్ట్రెయిట్ మలయాళం సినిమా చేయబోతున్నాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పడం విశేషం. సాధారణంగా తమిళ హీరోల సినిమాలు తెలుగులో విడుదలవుతునప్పడు వారిని తెలుగు స్ట్రెయిట్ సినిమా ఎప్పుడు తీస్తారు అని అడుగుతుంటారు.
వారు కూడా ఆ నిమిషానికి మంచి కథ దొరికితే చేస్తా అంటుంటారు. బన్నీ కూడా ఏదో మొక్కుబడిగాఈ కామెంట్ చేసి ఉంటారని అనుకుంటే పొరపాటే.. తన అభిమానుల కోసం బన్నీ సినిమా చేయాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడట. కొన్ని కథలపై చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. అతి త్వరలోనే స్ట్రెయిట్ మలయాళం సినిమా చేస్తానని, మలయాళంలో మంచి టేస్ట్ ఉన్న దర్శకులు ఉన్నారని.. అలాంటి ఇండస్ట్రీలో పని చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని స్పష్టం చేశాడు. ప్రస్తుతం బన్నీ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.