ఎన్టీఆర్ కు ప్రొడ్యూసర్ పంచ్!

యంగ్ టైగర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో సినిమా అంటే ఎంత హైప్ క్రియేట్ అవ్వాలో అంత హైప్ ఓపెనింగ్ రోజునే తెచ్చుకుంది ఈ అన్ టైటిల్డ్ ప్రాజెక్ట్. ఇక ఈ వేడుకకు పవన్ కూడా రావడంతో టోటల్ ఇండస్ట్రీ అటెంక్షన్ కూడా ఈ సినిమాకి దక్కింది. ఈ వేడుకలో అభయ్ రామ్ చలాకీగా తిరుగుతూ చిలిపి పనులు చేస్తూ సందడి చేయడంతో ఒక పండుగలా గడిచిపోయింది. అయితే క్లాప్ టైం లో పవన్,ఎన్టీఆర్ కలిసి త్రివిక్రమ్ ని ఆట పట్టించారు. ఆ తరువాత పవన్ ఆ టాపిక్ వదిలేసినా కూడా ఎన్టీఆర్ మాత్రం ”మీరు యాక్షన్ అని చెప్పలేదు” అంటూ అదే టాపిక్ తో త్రివిక్రమ్ ని కామెంట్ చేస్తూ వచ్చాడు. 

ఆ టైం లో జోక్యం చేసుకున్న నిర్మాత మాత్రం ”మీకు ఏది కావాలో అది చేసుకుంటారుగా …”అని అనేశాడు. అంతే ఆ మాటకి ఎన్టీఆర్ ముఖంలో రంగులు మారిపోయాయి. నిజానికి ఎన్టీఆర్ తో హారిక హాసిని బ్యానర్ లో ఎన్టీఆర్ సినిమా చేయడానికి ముఖ్యమయిన కారణం త్రివిక్రమ్, ఇంకా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మాత అయిన నాగవంశీ అనే టాక్ ముందు నుండి వినిపిస్తూ వస్తుంది.
 
అప్పుడప్పుడు ఎన్టీఆర్ డైరెక్టర్ పనుల్లో జోక్యం చేసుకుంటాడని ఉన్న రూమరే ఈ నిర్మాత మాటల్లో కూడా వినిపించినట్టయింది. ఎన్టీఆర్ మళ్ళీ నార్మల్ మూడ్ లోకి రావడానికి కొన్ని నిమిషాలు టైం పట్టింది.అలా ఈ కొత్త సినిమా ఓపెనింగ్ రోజునే ఎన్టీఆర్ కి ఊహించని పంచ్ పడింది.