HomeTelugu Trendingసినిమా సెట్‌లో మ్యాచ్‌ చూసిన బన్నీ

సినిమా సెట్‌లో మ్యాచ్‌ చూసిన బన్నీ

1 17స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా సెట్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ చూశారు. ఎంతో ఉత్కంఠగా ఆయన మ్యాచ్‌ చూస్తుండగా తీసిన వీడియోను హీరోయిన్‌ పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. బన్నీ మొబైల్‌ ఫోన్‌లో మ్యాచ్‌ చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని, గీతా ఆర్ట్స్‌ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఇందులో బన్నీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పాత్రను పోషించినట్లు తెలుస్తోంది.

View this post on Instagram

#Alluarjun

A post shared by allu arjun fans (@allu_arjun444) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu