కమల్ మరో సినిమా ఓకే చేశారు!

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘శభాష్ నాయుడు’ సినిమాలో నటిస్తున్నారు. దశావతారం సినిమాలో ఆయన నటించిన పది పాత్రల్లో ఒకటైన బలరామ్ నాయుడు పాత్రను లీడ్ గా తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారి శృతిహాసన్ తన తండ్రి కమల్ తో కలిసి నటిస్తోంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ అమెరికాలో పూర్తి చేశారు.

ఆ తరువాత పవన్ మెట్లపై నుండి కింద పడిపోవడంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. తాజాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను జనవరి నెల నుండి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వక ముందే కమల్ మరో సినిమా అంగీకరించినట్లు చెబుతున్నారు. సీనియర్ దర్శకుడు మౌళితో కలిసి పని చేయడానికి కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి మెయ్యప్పన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. మెయ్యప్పన్ అనేది నిర్మాత, ఏవీఎం స్టూడియో అధినేత పేరు కావడంతో ఈ చిత్రాన్ని ఆ సంస్థ నిర్మించనుందనే టాక్ వినిపిస్తోంది.