HomeTelugu Trendingహ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ క్యూటీ: అల్లు అర్జున్‌

హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ క్యూటీ: అల్లు అర్జున్‌

Allu Arjun wishes to his wi

పాన్‌ ఇండియా హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యమిస్తాడు. టైమ్‌ దొరికినప్పుడు.. కుటుంబ సభ్యులతో వెకేషన్లు, టూర్లకు వెళుతుంటాడు. ఇక తన పిల్లలతో కలిసి ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతు ఉంటాయి.

ఈ క్రమంలో నేడు అల్లు అర్జున్‌- స్నేహారెడ్డిల వెడ్డింగ్ యానివర్సరీ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భార్యకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపాడు బన్నీ. తన భార్యతో కలిసున్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మన వివాహమై 13 ఏళ్లయిపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత ప్రేమను, శక్తిని ఇచ్చావ్. మనం ఇలా మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ క్యూటీ’ అని తన భార్యపై ప్రేమను కురిపించాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్, స్నేహ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2011లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వివాహం జరిగింది. వీరికి పిల్లలు అయాన్, అర్హ గురించి అందరి తెలిసిందే .

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu