రామ్‌చరణ్ నటప్రస్థానానికి 11ఏళ్ళు

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా.. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు రామ్‌చరణ్‌. ‘చిరుత’ తో మొదలైన చరణ్‌ సినీ కెరీర్‌లో ‘మగధీర’ మైలురాయిగా నిలిచింది. ధృవ, రంగస్థలం సినిమాలు చరణ్‌ను నటుడిగా ఓస్థాయికి తీసుకెళ్లాయి. రామ్‌చరణ్ తన నటప్రస్థానానికి ఈ రోజుతో 11సంవత్సరాలు పూర్తి అయింది.

ఈ సందర్భంగా చరణ్‌ తన ఈ విజయానికి కారణమైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇప్పటికే 11 ఏళ్లు పూర్తి అయ్యాయంటే నమ్మలేకపోతున్నా. నిన్నే నటించడం ప్రారంభించిన ఫీలింగ్‌లో ఉన్నా. మీరు చూపిన ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. నా ఈ ప్రయాణంలో భాగస్వాములైన దర్శకులు, నిర్మాతలు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గౌరవంగా ఉంది. లవ్‌ యూ ఆల్‌’ అని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు తన సినిమా పోస్టర్లను కలిపి చేసిన కొలేజ్‌ను పంచుకున్నారు. చరణ్‌ ప్రస్తుతం తన 12వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.