HomeTelugu Trendingఇండస్ట్రీలో అడుగుపెట్టనున్న దిల్‌ రాజ్‌ భార్య!

ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్న దిల్‌ రాజ్‌ భార్య!

Dil raju wife tejaswini sup
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన భార్య తేజస్వినికి కూడా కథల విషయంలో చాలా పట్టు ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఇటీవలే తేజస్విని ఒక యూనిక్ స్టోరీ లైన్ ను దిల్ రాజుకు చెప్పారట. ఆ లైన్ నచ్చడంతో తన వద్ద ఉండే రచయితలకు కథగా డెవలప్ చేయాల్సిందిగా చెప్పాడట. ఆ స్టోరీ బాధ్యతను పూర్తిగా తేజస్వినికి దిల్ రాజు అప్పగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆమె కూడా కథల విషయంలో దిల్ రాజుకు చేదోడు వాదోడుగా ఉంటే ఆయన నుండి మరిన్ని మంచి సినిమాలు వస్తాయంటున్నారు. దిల్ రాజు సినిమాల నిర్మాణంకే పరిమితం అవ్వకుండా వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెడుతున్నాడు. ఆ బాధ్యతను తన భార్య తేజస్వినికి అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. అనుకున్నట్లు కథ కార్యరూపం దాల్చితే తేజస్వీని సైతం చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దిల్‌రాజు ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తున్న ఎఫ్‌3 మూవీ నిర్మాణ బాధ్యతల్లో బిజిబిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu