HomeTelugu Trendingగ‌ని పాటతో అల్లు అయాన్‌.. వీడియో వైరల్‌

గ‌ని పాటతో అల్లు అయాన్‌.. వీడియో వైరల్‌

allu ayaan debut ghani vide
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ‌ల‌కు సోషల్‌ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే బ‌న్నీ కూతురు అర్హ‌.. శాకుంత‌లం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వనున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో అర్హ భ‌ర‌తుడి పాత్ర పోషించింది. ఇక ఇదిలా ఉంటే బ‌న్నీ త‌న‌యుడు అయాన్.. గ‌ని సినిమాలోని పాట‌కు త‌న‌దైన స్టైల్‌లో అద‌ర‌గొట్టాడు. వ‌రుణ్ తేజ్ చిత్రంలో బాక్స‌ర్ అయ్యేందుకు ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడో అయాన్ త‌న స్టైల్‌లో చూపించాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్​గా కనిపించనున్నాడు. సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా కన్నడ స్టార్​ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ ‘గని’ చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!