HomeTelugu Trendingయాంకర్‌ శ్యామల భర్తపై చీటింగ్ కేసు!

యాంకర్‌ శ్యామల భర్తపై చీటింగ్ కేసు!

Cheating case on anchor shy

తెలుగు యాంకర్ శ్యామల భర్త, సీరియల్‌ నటుడు నరసింహ కొన్నాళ్ళ క్రితం కోటి రూపాయలు తీసుకొని ఇంతవరకు చెల్లించకుండా మోసం చేశాడంటూ ఓ మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేసింది. 2017 నుండి విడతల వారిగా డబ్బులు చెల్లించారని.. కొంతకాలం తర్వాత డబ్బులు అడిగితే నరసింహ బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె పేర్కొందట. డబ్బులు మాత్రమే కాకుండా తనను లైంగికంగా వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే నరసింహతో పాటు బాధితురాలు మరో మహిళ పై కూడా ఫిర్యాదు చేసిందట. ఆమె మధ్యలో ఉంటూ రాయబారం నడిపిందని చెప్పుకొచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రస్తుతం నరసింహతో పాటు సదరు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కు తరలించినట్లు టాలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం యాంకర్ శ్యామల భర్త పై చీటింగ్ కేసు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu