HomeTelugu Trendingశర్వాకి తల్లిగా అమల

శర్వాకి తల్లిగా అమల

8అమల అక్కినేని శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగులో నటించలేదు.మధ్యలో హిందీ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు ఈమె శర్వానంద్ హీరోగా డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ సంస్థలో కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించబోతుంది. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలు కూడా ప్రకటించారు. ఇక ఈ మధ్యే జీ 5 ఒరిజినల్స్ నుంచి వచ్చిన వెబ్ సిరీస్ కూడా చేసింది.

ఇక ఇప్పుడు శర్వానంద్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అమల అక్కినేని. ఇందులో అమల పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. శర్వానంద్ తల్లి పాత్రలో ఈమె కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలోనే ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తండ్రి.. న‌టుడు ర‌వి రాఘ‌వేంద్ర హీరోకు తండ్రి పాత్ర‌లో నటిస్తున్నాడు. కథ నచ్చడంతో వెంటనే శర్వా సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అమల. సెకండ్ షెడ్యూల్‌లో ఈమె అడుగు పెడుతుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu