HomeTelugu Trendingఒకే రోజు 3 సినిమాల అప్డేట్స్‌ ఇచ్చిన శర్వానంద్!

ఒకే రోజు 3 సినిమాల అప్డేట్స్‌ ఇచ్చిన శర్వానంద్!

sharwanand 2

టాలీవుడ్ యంగ్‌ హీరో శర్వానంద్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన వరుస సినిమాలు అప్డేట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తున్నాడు. ఈ రోజు శర్వా 3 సినిమాల అప్డేట్‌ ఇచ్చాడు.  35,36 37, ప్రాజెక్టులను ప్రకటించాడు.

Sharwa 35 :శర్వానంద్‌ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రానికి మనమే టైటిల్‌ను ఫైనల్ చేశారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక ఈ పోస్టర్‌లో శర్వానంద్ పక్కనే చిన్న బాబు కనిపిస్తున్నాడు. ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా విడుదల చేశారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ నిర్మిస్తోంది.

Sharwa 36: ఈ సినిమాకి కు సంబంధించిన కొత్త అప్డేట్‌ వచ్చింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గూస్‌బంప్స్‌ తెప్పించే అడ్వెంచరస్‌ రైడ్‌కు సిద్దంగా ఉండండి.. అంటూ శర్వానంద్‌ షేర్ చేసిన లుక్‌ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ లాంఛింగ్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sharwanand 3
Sharwa37: అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి శర్వానంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రేమ, నవ్వుల కలయికను ఇదివరకెన్నడూ లేని విధంగా సెలబ్రేట్‌ చేసుకునేందుకు రెడీగా ఉండండి. అద్భుతమైన ఫన్‌ రైడ్.. అంటూ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సరికొత్త న్యూస్‌ను అందరితో పంచుకుంది. ఈ లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా విడుదలైన ఈ మూడు సినిమా అప్డేట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

sharwanand 1

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu