HomeTelugu NewsSharwa37: బాలకృష్ణ మూవీ టైటిల్‌తో శర్వానంద్‌!

Sharwa37: బాలకృష్ణ మూవీ టైటిల్‌తో శర్వానంద్‌!

Sharwa37

Sharwa37 with balakrishna movie title: టాలీవుడ్‌ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. మూడు సినిమాలు లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం ‘మనమే’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత శర్వానంద్ 36, శర్వానంద్ 37 సినిమాలు ఉన్నాయి. శర్వా 37వ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా.. AK ఎంటర్టైన్మెంట్ లో తెరకెక్కబోతుంది.

ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు శర్వా తండ్రి పాత్రలో కూడా కనిపిస్తాడని ఇప్పటికే టాక్ నడుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టాలీవుడ్ టాక్‌ ప్రకారం ఈ సినిమాకి బాలకృష్ణ మూవీ టైటిల్ పెడతారని తెలుస్తుంది.

sharwanand 1 1 sharwanand,sharwa 37,balakrishna,Nari Nari Naduma Murari

గతంలో బాలకృష్ణ.. ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఇద్దరు భామల మధ్య నలిగిపోయిన హీరోలా బాలయ్య కామెడీతో నవ్వించి ఎమోషన్ కూడా పండించాడు. ఇప్పుడు అదే టైటిల్ ని శర్వానంద్ సినిమాకు పెట్టబోతున్నట్టు వినికిడి.

శర్వానంద్ 37వ సినిమాకి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్ ఫిక్స్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగ ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. డైరెక్టర్‌ రామ్ అబ్బరాజు శ్రీవిష్ణుతో కలిసి చేసిన ‘సామజవరగమన’ సినిమాతో హిలేరియస్ గా నవ్వించి హిట్ కొట్టాడు. ఈ క్రమంలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu