HomeTelugu Trendingనాగార్జున్‌కు నో చెప్పిన యంగ్‌ హీరోయిన్‌!

నాగార్జున్‌కు నో చెప్పిన యంగ్‌ హీరోయిన్‌!

Amalapal says no to nagarju

కోలీవుడ్ బ్యూటీ అమలా పాల్ ఇటీవల కుడి ఎడమైతే సిరీస్ తో తెలుగువారిని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత టాలీవుడ్ లో కనిపించలేదు. అంటే మరో రకంగా చెప్పాలంటే టాలీవుడ్ అమ్మడిని ఎవరు పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా అమలా రెమ్యూనిరేషన్ ఎక్కువ చెప్పడంతో అవి కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయట. ఇక తాజాగా ఈ అమ్మడు నాగార్జున సినిమాకు నో చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Amalapal 11

నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఘోస్ట్. ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్ నటించాల్సింది. కానీ ఆమె గర్భవతి కావడంతో ఆమె ప్లేస్ లో అమలాని సంప్రాదించారట మేకర్స్. ఈ ఆఫర్ ని అందిపుచ్చుకోకుండా అమలా రెమ్యూనిరేషన్ విషయంలో తగ్గలేను అని చెప్పుకొచ్చిందంట. దీంతో మేకర్స్ అంత ఇవ్వలేమని తెలుపుతూ అమ్మడిని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాగ్‌ సరసన నటించడానికి కుర్ర హీరోయిన్లు పోటీపడుతుండగా అమలా నో చెప్పడంతో .. ఈ హీరోయిన్ కి మాములుగా లేదుగా అని అందరు నోళ్లు నొక్కుకుంటున్నారట.

మరోసారి రోషన్‌కు జోడీగా శ్రీలీల!

Recent Articles English

Gallery

Recent Articles Telugu