HomeTelugu Trendingమరోసారి రోషన్‌కు జోడీగా శ్రీలీల!

మరోసారి రోషన్‌కు జోడీగా శ్రీలీల!

Sreeleela again with roshan
టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీలీల పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. రోషన్ జోడీగా తెరపై ఈ సుందరి చేసిన అందాల సందడికి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. రాఘవేంద్రరావు ఎంపిక చేసిన హీరోయిన్ అనగానే సహజంగానే అందరి దృష్టి ఆమె పైకి వెళ్లింది. అందుకు తగినట్టుగానే అందరి కళ్లను కట్టిపడేసింది.

ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, అమ్మడి అందాలకు మంచి మార్కులు పడిపోయాయి. దాంతో సహజంగానే వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. ఎంతమాత్రం గ్యాప్ లేకుండా ఆమె వరుస సినిమాలు ఒప్పుకుంటూ వెళుతుండటం విశేషం. ఆ జాబితాలో రవితేజ .. వైష్ణవ్ తేజ్ .. మహేశ్ .. ప్రభాస్ సినిమాలు ఉండటం మరో విశేషం.

తాజాగా ఈ బ్యూటీ రోషన్ జోడీగా మరోసారి కనువిందు చేయనున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వైజయంతి మూవీస్ వారు ఒక ప్రాజెక్టును సెట్ చేస్తున్నారట. 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడిని పరిచయం చేయనున్నారని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.

సర్కారువారి పాట: కళావతి సాంగ్‌ విడుదల

Recent Articles English

Gallery

Recent Articles Telugu