HomeTelugu Trending'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ambajipeta marriage band re
టాలీవుడ్‌ నటుడు సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివానీ నగరం హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచుతున్నాయి.

ఈ చిత్రం నుంచి రిలీజ్‌ చేసిన గుమ్మా సాంగ్‌ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమా రిలీజ్‌ అప్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చేసింది సుహాస్‌ టీం. ఈ మూవీని 2024 ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

హీరోహీరోయిన్ల మధ్య సరదా లవ్‌ ట్రాక్‌తో సాగుతున్న గుమ్మా సాంగ్‌ మ్యూజిక్ లవర్స్‌ ను ఇంప్రెస్ చేస్తుండగా.. మేకింగ్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సుహాస్‌ టీజర్‌లో ఓ వైపు హెయిర్ సెలూన్ నడిపిస్తూ.. మరోవైపు మ్యారేజి బ్యాండు టీంలో కలిసి పనిచేస్తూ.. శివానీతో లవ్‌లో పడే యువకుడిగా ఫన్‌, సీరియస్‌గా ఎంటర్‌టైన్‌ చేయనున్నట్టు తెలియజేశాడు డైరెక్టర్‌.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu