వైరల్ అవుతున్న ప్రియాంక-నిక్‌ల ప్రైవేట్ ఫోటో.. మూడో వ్యక్తి ఉన్నడంటున్న నిక్‌

ట్విటర్‌లో ప్రియాంక-నిక్ జోనస్ ఏకాంతంగా ఉన్న ఓ ఫొటో వైరల్ అవుతోంది. స్వయంగా ప్రియాంక చోప్రానే ట్విటర్‌లో ఫొటో పోస్ట్ చేసినప్పటికీ..అసలు ఆ ఫోటో తీసారన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగుతోంది. వెరైటీ డౌట్స్‌‌తో వేలకొద్ది ట్వీట్స్ వెల్లువెత్తాయి. వారిద్దరిని ఫొటో తీసిన ఆ మూడో వ్యక్తి ఎవరు అయి ఉంటారబ్బా? అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పీఆర్ సిబ్బంది అని ఒకరంటే.. కాదు కాదు పనిమనిషి అయి ఉంటుందని మరొకరు ట్వీట్ చేశారు. అలెక్సా, జాన్ సీనా అంటూ ఎవరికి నచ్చిన పేర్లను వారు షేర్ చేస్తున్నారు. ఇదంతా కాదు..సీసీ ఫుటేజీ నుంచి స్క్రీన్ షాట్ తీశాని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఇలా ట్విటర్‌లో ఎక్కడ చూసినా ఈ ఫొటో గురించే చర్చ జరుగుతోంది.

ఆ ఫొటోపై ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వయంగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ స్పందించారు. ఆ ఫొటో వెనక కథను ఇన్‌స్టగ్రామ్ వేదికగా బయటపెట్టారు. గదిలో తాము ఏకాంతంగా లేమని..తమతో పాటు ఫ్రెండ్ కూడా ఉన్నాడని పేర్కొన్నారు. అతడే ఆ ఫొటోను తీశాడని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఆ మేరకు ఇన్‌స్టగ్రామ్‌లో నిక్ జోనస్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో.. నిద్రపోతున్న తన మిత్రుడిని సరదగా ఆటపట్టించాడు. తన భర్త చేసిన చిలిపి పని చూసి..పక్కనే ఉన్న ప్రియాంక నవ్వుతూ కనిపించింది