HomeTelugu Big Storiesబిగ్‌బీకి జాబ్‌ ఆఫర్‌ చేసిన అభిమాని

బిగ్‌బీకి జాబ్‌ ఆఫర్‌ చేసిన అభిమాని

Amitabh Bachchan gets job o 1

బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఆయన సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ క్రమంలో కరోనా నుంచి కోలుకున్న ఆయన ఇకపై తనకు ఉద్యోగం దొరుకుతుందో లేదో అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సందేహం వ్యక్తం చేశాడు. అయితే 65 ఏళ్లపైబడిన వారు అవుట్‌ డోర్‌ షూటింగ్‌లో పాల్గొనేందుకు వీలు లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. దీంతో మహరాష్ట్ర ఉత్తర్వులను ఉద్దేశిస్తూ బిగ్‌బీ సరదాగా చేసిన ట్వీట్‌కు పై ఓ అభిమాని ఫన్నీగా స్పందించాడు.

అమితాబ్‌కు ఉద్యోగ అవకాశం ఇస్తున్నట్లు ఓ ఆఫర్‌ లెటర్‌ను ఆయన పోస్టుకు ట్యాగ్‌ చేశాడు. దీనికి అమితాబ్‌.. ‘ఊహించని రీతిలో నాకు ఉద్యోగం వచ్చింది’ చూడండి అంటూ ఆ లెటర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ‘‘ప్రియమైన మిస్టర్ అమితాబ్‌… కొన్ని కారణాల వల్ల ప్రత్యామ్నాయంగా మీకు ఉద్యోగం ఇచ్చేందుకు మీ దరఖాస్తు తాత్కాలికంగా సమీక్షలో ఉందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము’’ అని ఉంది. ఇటీవల అమితాబ్‌తో పాటు అభిషేక్‌, ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్యలు కూడా కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu