
Indian Movie which sold 25 crores tickets:
1975లో విడుదలైన “షోలే” సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. దర్శకుడు రమేష్ సిప్పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదట్లో ఫ్లాప్ టాక్ అందుకుంది, కానీ అద్భుతమైన కథ, గుర్తుండిపోయే పాత్రలు, అదిరిపోయే సంభాషణలతో సంచలనాత్మకంగా విజయం సాధించింది. ఈ చిత్రం నేటికి 25 కోట్ల టికెట్లు అమ్మిన రికార్డు తో భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన సినిమా గా నిలిచింది.
షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమా మాలినీ, జయా భచ్చన్, సంజీవ్ కుమార్, అంజద్ ఖాన్ (గబ్బర్ సింగ్ పాత్రలో) వంటి అగ్రనటులు నటించారు. మొదట్లో ఈ సినిమా నెమ్మదిగా ప్రదర్శన చూపించినప్పటికీ, పబ్లిక్ స్పందన పెరిగిం చిత్రానికి ఆదరణ మరింత పెరిగింది. “కిట్నే ఆద్మీ థే?” అనే డైలాగ్ దేశవ్యాప్తంగా సంచలనంగా కూడా నిలిచింది.
View this post on Instagram
6 సంవత్సరాల చిత్రరంగంలో ఈ చిత్రం ఇండియాలో 15 కోట్ల టికెట్లు అమ్మింది. ఆపై తిరిగి రీ రిలీజ్ లో మరొక 3 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. అంతర్జాతీయంగా ఈ సినిమా సోవియట్ యూనియన్‌లో ప్రత్యేకంగా విజయవంతం అయ్యింది, అక్కడ 6 కోట్ల టికెట్లు అమ్ముడయినట్లు తెలుస్తోంది. యూరప్, ఉత్తర అమెరికా మధ్యప్రాచ్యంలో కూడా ఈ చిత్రానికి విపరీతమైన ఆదరణ లభించింది, మొత్తం 25 కోట్ల టికెట్లు అమ్మడాన్ని రికార్డు సాధించింది.
బాహుబలి 2, RRR వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించినప్పటికీ, వాటి టికెట్ విక్రయాలు షోలే కు సమానం కావు. షోలే లెగసీ ఇప్పటికీ ఎవరూ కొట్టలేదు. “షోలే” ఒక సినిమా మాత్రమే కాదు, అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ కి ఒక ఎమోషన్.. అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక మైలురాయి కూడా.
ALSO READ: 2024 లో ఎక్కువ టిక్కెట్లు ఈ సినిమాకి అమ్ముడయ్యాయి!